విజయవాడ పర్యటనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

విజయవాడ పర్యటనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

విజయవాడ, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ విజయవాడ పర్యటన సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. పటమట డొంక రోడ్డులోని ఆంట్రా లక్స్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ సౌజన్యంతో స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి పర్యటనకు సంబంధించి నగరంలో భద్రతా ఏర్పాట్లను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమ స్థల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, ప్రవేశ మార్గాల తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి చర్యలను సమన్వయంతో అమలు చేయించారు.

భద్రతా ప్రణాళికను ముందస్తుగా సిద్ధం చేసి, అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అధికారుల మధ్య సమన్వయం, సిబ్బందికి స్పష్టమైన దిశానిర్దేశం, సమయపాలన వంటి అంశాలపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. పర్యటన అంతటా ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీస్ యంత్రాంగం సమర్థంగా పనిచేయడానికి మార్గనిర్దేశం చేశారు.

Leave a Reply