chicken | బస్సెక్కి వచ్చేస్తున్నా వదినా…

chicken | బస్సెక్కి వచ్చేస్తున్నా వదినా…

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణలో చికెన్ షాపులన్నీ షట్టర్లు మూసేసి కనిపిస్తున్నాయి. చికెన్ ప్రియులు అలా చూస్తూ తట్టుకోలేకపోతున్నారు. అయితే కాస్త ముందు చూపు ఉన్నవాళ్ళు మాత్రం నిన్ననే ఈరోజుకి, రేపటికి కూడా కావలసినంత చికెన్ తెచ్చుకుని ఫ్రిజ్జుల్లో దాచేసుకున్నారు. కానీ, ఫ్రెష్ గా షాపుకెళ్ళి కొట్టించుకుని తెచ్చుకుని వండుకుంటే వచ్చే మజా ఎక్కువరోజులు ఫ్రిజ్జులో దాచేసిన చికెన్ ని తీసుకుని వండుకుంటే వస్తుందా? ఇప్పుడు తెలంగాణలో చికెన్ ప్రియుల పరిస్థితి అదే పాపం.

chicken | తాత్కాలికంగా చికెన్ కథ…

ఎన్ని రోజులకని తెచ్చుకుని దాచుకోగలరు? కనుక వ్యాపారులకు-పౌల్ట్రీ రైతులకు మధ్య వివాదమేదో త్వరగా సమసి పోతే బాగుండును అని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారట. మళ్ళీ మా ఇంట్లో చికెన్ ఘుమఘుమలు వ్యాపించేలా అనుగ్రహించు దేవుడా అని వేనోళ్ళ కోరుకుంటున్నారట. ఇవన్నీ కాదు, మళ్ళీ చికెన్ షాపులు తెరిచేదాకా మేమస్సలు ఆగలేమనుకున్న వాళ్ళు మాత్రం…ఇదిగో ఇలా ఎంచక్కా ఆధార్ కార్డు తీసుకుని, బస్సెక్కేసి, ఏపీ బోర్డర్ దాకా వెళ్తే చాలు, అక్కణ్ణుంచి మనవాళ్ళెవరో వచ్చేసి మనక్కావలసిన చికెన్ తెచ్చి ఇచ్చేస్తారు.

అది తీసుకుని, మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చేసి ఇంటికి చేరుకోవచ్చు. తాత్కాలికంగా చికెన్ కథ సుఖాంతం….అంతే.

Leave a Reply