Chhattisgarh | ఎన్‌కౌంటర్.. ఇద్ద‌రు మావోలు మృతి !

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో బుధవారం సాయంత్రం భద్రతా బలగాలు చేపట్టిన తనిఖీల సందర్భంగా ఓ కీలక ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కుకనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

మృతుల్లో స్థానిక స్క్వాడ్ కమాండర్ కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఘటనాస్థలంలో భద్రతా బలగాలు ఆయుధాలు, నక్సల్ సంబంధిత పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించి ఇంకా కొన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అధికార వర్గాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

Leave a Reply