Chhattisgarh | ఎన్ కౌంటర్..

Chhattisgarh | ఎన్ కౌంటర్..
Chhattisgarh, ఆంధ్రప్రభ : సుకుమా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోని కరి గుండం అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ (Encounter) జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
