ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ఎండపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో యాంగ్ వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి యువతలో దేశభక్తి భావాలు రేకెత్తించారు. ర్యాలీ మొత్తం మండలంలోని ప్రధాన వీధుల మీదుగా సాగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ర్యాలీలో పాల్గొన్న యువకులు శివాజీ మహారాజ్ వీరోచిత గాధలను స్మరించుకుంటూ ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా ప్రతిభ గురించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. యువత శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరించాలని, సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షుడ రాజకుమార్, ప్రధాన కార్యదర్శి గణేష్,సంయుక్త కార్యదర్శి చక్రి గౌడ్,సలహాదారులు కిరణ్, రాజు, యూత్ సభ్యులు, గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply