ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని దిల్దార్ నగర్ లో గ్రామంలో గురువారం హిందూ హృదయ సామ్రాట్ హైందవి స్వరాజ్య స్ఫూర్తిదాయకుడు గెరిల్లా యుద్ధ నిపుణుడు మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు యూత్ సభ్యులు కలసి గ్రామంలో గల శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనలో చూపిన ప్రతిభ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్దార్ నగర్ గ్రామ సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్ వీడీసీ చైర్మన్ కొండాడి జగ్గారావు నాయకులు ఎంఎస్ సత్యనారాయణరావు మందపల్లి రమేష్ వేములవాడ రవి డి ప్రవీణ్ కొత్తూరి ప్రవీణ్ అంతర్పుల గంగారం గ్రామ పెద్దలు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply