ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

కడెం(నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో గురువారం హిందూ హృదయ సామ్రాట్ హైందవి స్వరాజ్య స్ఫూర్తిదాయకుడు గెరిల్లా యుద్ధ నిపుణుడు మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు యూత్ సభ్యులు కలసి గ్రామంలో గల శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనలో చూపిన ప్రతిభ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
వేడుకల్లో భక్తి గీతాలు, నినాదాలు, ర్యాలీ నిర్వహించి శివాజీ మహారాజ్ ఆశయాలను స్మరించుకున్నారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్త ఉప సర్పంచ్ నాగవత్ సరిత పంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్ నవ యువ శివ యూత్ అధ్యక్షులు కాశ వేణి తిరుపతి యాదవ్ ఉపాధ్యక్షులు బెడద అంజి ప్రధాన కార్యదర్శి అచ్చే రాకేష్ సంయుక్త కార్యదర్శి ఎం సాయి కుమార్ గౌడ్ కోశాధికారి హరీష్ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.
