Chevella | బ‌ర్త్ డే పార్టీపై మంగ్లీ వివరణ !

ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ తన పుట్టినరోజు వేడుకపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. తన పుట్టినరోజు పార్టీ పూర్తిగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కూడిన ప్రైవేట్ గ్యాదరింగ్ అని స్పష్టంగా చెప్పారు.

తన పార్టీలో ఎలాంటి డ్రగ్స్ వాడకం లేదని మంగ్లీ అన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన వ్యక్తి ఆ పదార్థాలను వేరే చోట సేవించాడని పోలీసులు నిర్ధారించారని మంగ్లీ పేర్కొన్నారు. చేవెళ్లలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో జరిగిన త‌న బ‌ర్త్ డే ఈవెంట్ పూర్తిగా కుటుంబ వేడుక అని.. పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పటికీ, అక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు కనిపించలేదని మంగ్లీ స్పష్టం చేశారు.

అయితే, సౌండ్ సిస్టమ్ వాడటానికి, మద్యం సరఫరా చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంద‌నే విష‌యం తనకు తెలియదని మంగ్లీ తెలిపారు. ఇక్కడ దేశీయ మద్యం మాత్రమే వినియోగించామ‌ని.. విదేశీ మద్యం ఏమీ ఇవ్వలేదు అని పేర్కొన్నారు

తన వైపు నుంచి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు జరగలేదని, నిబంధనలను ఉల్లంఘించడం అనేది తెలియక చేసిన పొరపాటు అని మంగ్లీ స్పష్టంగా చేశారు. పార్టీ సమయంలో జరిగిన కొన్ని విధానపరమైన అవకతవకలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఈ ద‌ర్యాప్తుకు త‌న‌ పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు మంగ్లీ చెప్పారు.

Leave a Reply