Chennur | బీఆర్ఎస్ నాయకుల ఇంటింటా ప్రచారం

Chennur | బీఆర్ఎస్ నాయకుల ఇంటింటా ప్రచారం

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : అధికార కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ‘కన్నీరు పెడుతున్న చెన్నూర్’ అనే క్యాప్సన్ తో కరపత్రాల పంపిణీ చేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఉడడంతో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయినప్పటికీ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి కాలేదని.. గత ప్రభుత్వ అభివృద్ధికే పూతలు పుస్తూ గారేడీ చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలా ఉసెలేదని అన్నారు. ఈ ప్రచారంలో బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ రెవెల్లి మహేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply