Chennur | మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు

Chennur | మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు
Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ: చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో చెన్నూరు మాజీ మార్కెట్ కమిటి చెర్మెన్, బీజేపీ నాయకులు బత్తుల సమ్మయ్యతో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరస్తూ, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, సీనియర్ నాయకులు గోడిసేల బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
