Chennur | సర్వే ఆధారంగానే బిఫామ్‌లు

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : జీవితతంత పార్టీ జెండా మోసిన పార్టీని ముందుకు నడిపించిన ప్రధాన పార్టీల కార్యకర్తలకు, నాయకులకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిఫామ్ లభించడంలో చుక్కదేరవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ,బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు తమ తమ పార్టీలు చేపట్టిన సర్వేల ఆధారంగానే బిఫామ్ లో ఇవ్వనున్నట్లు భీస్మించుకొని కూర్చున్నాయి. దీనితో అధిష్టాన ప్రజా ప్రతినిధుల గెలుపు కొరకు శ్రమించి అధికారని అంటగడితే చివరికి మేము పార్టీ తరపున పోటీ చేసేందుకు అర్హత సాధించలేక పోవడం ఆశావాహుల్లో నిరుత్సహానికి గురి చేస్తుంది. చెన్నూరు మున్సిపల్ పరిధిలో 18 వార్డులకు గాను ప్రధాన పార్టీల 160 మంది (కాంగ్రెస్ పార్టీ 74, బీఆర్ఎస్, బీజేపీ 37) నామిషన్లు దాఖాలు చేసి అధిష్టానం అందించే బిఫామ్ ల కొరకు వెంపర్లు పడుతున్నారు.

Leave a Reply