Chennur | అభివృద్ధి చేసింది నేనే

Chennur | అభివృద్ధి చేసింది నేనే

  • మాజీ మంత్రి బోడ జనార్దన్

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గాన్ని తన పాలన హయాంలో నే అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి బోడ జనర్దన్ అన్నారు.గత మూడు రోజుల క్రితం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తనపై చేసిన అనిచిత వ్యాఖ్యలను బోడ తప్పు పట్టారు. ఈరోజు ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేఖర్ల సమావేశం లో సుమన్ చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాను చెన్నూరు నియోజకవర్గంలో అసలు అభివృద్ధి చేసింది తానేనని మాజీ మంత్రి బోడ జనార్ధన్ తెలిపారు. 1985 నుండి 2004 వరకు 04 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అలాగే ఒకసారి కార్మిక శాఖ మంత్రిగా పని చేశానని పేర్కొన్నారు. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినందు వల్లే చెన్నూరు ప్రజలు తనను నాలుగు సార్లు గెలిపించారని తెలిపారు.

చెన్నూరు నియోజకవర్గం లో తాను చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. గడిచిన గత పది ఏళ్లలో బాల్క సుమన్ ఐదు సంవత్సరాలు ఎంపీగా, ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఎద్దేవా చేశారు. నిజంగా బాల్క సుమన్ కి చిత్తశుద్ధి ఉంటే తన హయాంలో ఏఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో బహిరంగంగా తెలుపాలని సవాలు విసిరారు.

Leave a Reply