Cheating | పోసాని కృష్ణమురళిపై మరో ఫిర్యాదు

వెలగపూడి – కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె. సత్యనారాయణ శెట్టి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళీ.. మహేష్ అనే వ్యక్తులు తన వద్ద నుండి రూ. 9 లక్షలు తీసుకొని మోసం చేశారని.. దీనిపై గచ్చిబౌలిలో కేసు పెట్టినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదని.. డబ్బులు మోసపోవడంతో ఐదేళ్లనుండి ఇంటీకి కూడా పోలేక. గుంటూరులో కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నానని.. తనకు ఇప్పుడు చావే శరణ్యమని.. దయ చేసి తనకు రావాల్సిన డబ్బులను పోసాని నుండి ఇప్పించి న్యాయం చేయాలని నేతలు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ లకు అర్జీ ఇచ్చి వాపోయాడు.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామానికి చెందిన ముల్లా ఖాతూన్ బీ గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 2009 సంవత్సరంలో తుంగభద్రకు వరద వచ్చి తమ ఊరు మునిగిపోగా.. అప్పుడు ప్రభుత్వం తమకు ఇల్లు మంజూరు చేసిందని.. అయితే తమకు మంజూరైన ఇంటిని వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన అనుచరుడికి ఇచ్చి తమకు అన్యాయం చేశాడని.. తమ ఇల్లు తమకు ఇప్పించాలని గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

తమ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. తాగునీటి కుళాయిలు, స్మశానవాటికతో పాటు సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను నిర్మించాలని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడెంకు చెందిన మాజీ సర్పంచ్ కె. కళావతి, మాజీ ఎంపీటీసీ తదితరులు నేడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. •

కబ్జా దారులు తమ భూమికి ఉన్న సరిహద్దు రాళ్లు పీకి భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని.. దయ చేసి తమ భూమిని సర్వే చేసి రాళ్లు పాతించాలని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలానికి చెందిన ఎమ్. సత్యం నేతలకు అర్జీ అభ్యర్ధించాడు. •

బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన నారిశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేస్తూ.. తాను కొనుగోలు చేసిన భూమిని దొంగ రిజిస్ట్రషన్ చేసుకోవడమే కాకుండా.. తనపైకి దౌర్జన్యం చేస్తూ.. తనను చంపుతామని బెదిరిస్తున్నారని.. ఆక్రమణ దారులకు అధికారులు వత్తాసు పలుకుతూ తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నారని.. తమ వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించి తమ భూమిని కబ్జా నుండి విడిపించాలని గ్రీవెన్స్ లో నేతలకు వేడుకున్నాడు. •

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొత్తపల్లె, గోకవరం మజరా, యం. లింగాపురం గ్రామాలకు చెందిన పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తూ.. రైతులకు సాగునీటికోసం చెరువును నిర్మించి నీటి పారుదల కోసం కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో నీరంతా తూము ద్వారా వాగుకు వృథాగా పోతుందని.. దయ చేసి కాలువలు ఏర్పాటు చేసి సాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.•

కడప జిల్లా కడపకు చెందిన ఎస్. బాషా విజ్ఞప్తి చేస్తూ.. కడప టౌన్ నందు ప్రైవేట్ స్థలాల్లో ఎగ్జిబిషన్ లు పెట్టకూడదని గత ప్రభుత్వంలో తీర్మానం చేడంతో దాదాపు 300 కుటుంబాలకు పైగా ఉపాధి కోల్పోయారని.. ఎగ్జిబిషన్ లు పెట్టుకోవడానికి పర్మిషన్ లు ఇప్పించి ఆదుకోవాలని గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *