
Chautuppal | బీజేపీలో చేరికలు..
Chautuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని అంకిరెడ్డిగూడెం గ్రామ బీఆర్ఎస్వీ విద్యార్థి యువజన అధ్యక్షులు పర్నే భరత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇవాళ బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రమణగొని శంకరయ్య, పార్టీ మండల ఉపాధ్యక్షులు పర్నే శ్రీను రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి రమణగోని శంకరయ్య కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పనా ఐలయ్య యాదవ్, 30వ బూత్ అధ్యక్షులు బత్తుల మహేష్ గౌడ్, పర్నే శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
