Chandrasekhar | పంచాయతీ అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తా…
- ఆశీర్వదిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటా
- బాల్ గుర్తుతో విజయం దిశగా ప్రచారం
- కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చంద్రశేఖర్
Chandrasekhar | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధి రామంజిగూడెం గ్రామపంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మోకాళ్ళ చంద్రశేఖర్ హ్యాండ్ బ్యాగ్ పర్స్ గుర్తుతో దూసుకుపోతున్నారు. గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చానని హ్యాండ్ పర్సు గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి మండలంలో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామాలు తునికిబండల, వలసల్లా, రాయిలంక, ఇప్పనపల్లి, రామాంజిగూడెం గ్రామాల్లో వినూత్న ప్రచారంతో రేయంబవళ్ళుగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసేందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలని, పర్సు గుర్తుపై మీఅమూల్యమైన ఓటువేసి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించే వ్యక్తిగా ఉంటానని, అభివృద్ధిలో అగ్రగామిగా చేసేందుకు కృషి చేస్తానని, గ్రామాల్లో ప్రజలకు సహకరిస్తానని గడపగడపకు ప్రచారాలు చేస్తూ, ప్రజలతో మమేకమవుతూ సమస్యలు పరిష్కరిస్థానన్ని పర్సు గుర్తుపై ఓటుతో ఆశీర్వదించాలని కోరారు.
ఏదేమైనా రామంజిగూడెం పంచాయతీలో మువ్వెన్నెల జెండా ఎగరడం ఖాయమని ప్రజలు బహాటంగానే చర్చించుకోవడం విశేషం. రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీతోనే మండల అభివృద్ధికి సాధ్యమని, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సారధ్యంలోని మండల కేంద్రంతో పాటుగా రామంజిగూడెం గ్రామ పంచాయతీకి అధిక నిధులను తెప్పించి అభివృద్ధికి తమ వంతు సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

