Chandrababu Naidu | విద్యాభివృద్ధికి కృషి చేయాలి..

Chandrababu Naidu | విద్యాభివృద్ధికి కృషి చేయాలి..

  • సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌

Chandrababu Naidu | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పేదలకు విద్యను అందించాలని, విద్యాభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సూచించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంఘం నాయకులు ఈ రోజు వారిని కలిశారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకులు లంకలపల్లి సాయి శ్రీనివాస్, మల్లు రఘునాథరెడ్డి తోపాటు ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు హృదయ రాజు, చిరంజీవి పలువురు కలిశారు. 2017లో తమరు చేసిన ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు కాకుండా ఆగిపోయింద‌ని తెలిపారు. ఈ విష‌యంలో జోక్యం చేసుకొని ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని వివరాలతో కూడిన లేఖను అందించి ముఖ్యమంత్రికి అందజేశారు.

12వ పీఆర్సీ గడువు 29 నెలలు అయిపోయినందున ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణను అమలు చేయాలని సీఎంను (CM) కోరారు. ఇంకా రావాల్సిన పెండింగ్ డీఏలను విడుదల చేయాలన్నారు. రావలసిన సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలన్నారు. రిటైర్మెంట్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బకాయిలను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగ పురోభివృద్ధికి సహకరించాలని ఉపాధ్యాయులను కోరారు. టెట్‌పై ప్రభుత్వం స్పందించాలని ప్రాతినిథ్యం చేయగా ప్రభుత్వపరంగా రివ్యూ పిటిషన్ వేశామని, ఉపాధ్యాయుల వైపు నిలబడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు.

బోధనేతర కార్యక్రమాల భారం ఉపాధ్యాయులకు తగ్గిస్తే బోధనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తారని, భారం లేకుండా చూడాలని ప్రాతినిధ్యం చేశారు. Mసర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద విద్యార్థులకు (Students) అందించే షూ నాణ్యత పెంచాలని, విద్యార్థులకు సరైన కొలతలతో షూ అందించాలని ప్రాతినిధ్యం చేయగా అంగీకరించారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని ప్రాతినిధ్యం చేయగా అధికారులతో చర్చిస్తామన్నారు. ఎస్ ఎస్ సి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా, స్లిప్ టెస్ట్ మార్కుల నమోదుపై ఉపాధ్యాయులపై చేస్తున్న ఒత్తిడిని తగ్గించాలని, సెలవు రోజుల్లో పనిచేసిన కాలానికి సీసీఎల్ మంజూరు చేయాలని ప్రాతినిధ్యం చేయగా సమస్య పరిష్కరిస్తానన్నారు.

జీవో 342 ప్రకారం బిఈడి/బిపిఈడి కోర్సు చేయుటకు అనుమతులు ఇవ్వడంలో ఇబ్బందులను తొలగించాలని ప్రాతినిధ్యం చేయగా వచ్చే విద్యా సంవత్సరం నుండి సులభతరమైన పద్ధతిలో అనుమతించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక విద్యచేసిన ఉపాధ్యాయులకు పదోన్నతులు, నియామకాలు చేపట్టాలని కోరారు. ఎంఈఓ ల బదిలీలు చేపట్టాలని ప్రాతినిధ్యం- సానుకూలంగా స్పందచారు.ఆర్థిక బకాయిల చెల్లింపుకు రోడ్ మ్యాప్,12వ పిఆర్సి, మధ్యంతర భృతి మంజూరు, సిపిఎస్ రద్దు పై ఇచ్చిన హామీ, 57 మెమో మేరకు 2003 డీఎస్సీ (DSP) వారికి పాత పెన్షన్ అమలుపై ప్రాతినిధ్యం చేశారు. ఎస్.ఎస్.ఏ పరిధిలో పనిచేయు సిఆర్ఎంటిలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఇతర సిబ్బందికి సంబంధించిన సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగిందన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఎటువంటి కొత్త మార్పులు ప్రవేశపెట్టమని, మంచి ఫలితాలు సాధించాలని, విద్యార్థుల సంఖ్య పెంచుటకు ఉపాధ్యాయులు సహకరించాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాల నాయకులను కోరారు.

CLICK HERE TO READ పోల‌వ‌రంలో చంద్ర‌బాబు

CLICK HERE TO RAED MORE

Leave a Reply