Chandrababu | అన్నప్రసాదాలు వడ్డించిన ముఖ్యమంత్రి, కుటుంబసభ్యులు..

Chandrababu | అన్నప్రసాదాలు వడ్డించిన ముఖ్యమంత్రి, కుటుంబసభ్యులు..
తిరుమలలో అన్నప్రసాదాలు వడ్డించిన ముఖ్యమంత్రి
భక్తులతో ముచ్చటించిన చంద్రబాబు నాయుడు
టీటీడీ సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలు
భక్తులతో కలిసి భోజనం చేసిన సీఎం
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా విరాళం
అన్నప్రసాదానికి రూ.44 లక్షలు అందించిన నారా లోకేష్
Chandrababu | తిరుమల,ఆంధ్రప్రభ : తిరుమల శ్రీవారి దర్శనానంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.

ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ముఖ్యమంత్రివర్యులు వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు.

ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మనువడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే రూ.44లక్షల ఖర్చును, నారా లోకేష్ విరాళంగా అందించారు.









