Chandoo Mondeti | నెక్ట్స్ సినిమా ఏంటి…?

Chandoo Mondeti | నెక్ట్స్ సినిమా ఏంటి…?
Chandoo Mondeti | తండేల్ తర్వాత చందూ మొండేటి ప్లాన్స్
వాయుపుత్ర యానిమేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?
స్టార్ హీరోలతో ప్రాజెక్టులు ఎందుకు సెట్ కాలేదు?
నాగార్జునతో సినిమా ప్రచారం
కార్తికేయ 3కి రంగం సిద్ధం?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : చందూ మొండేటి.. టాలెంటెడ్ డైరెక్టర్. పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాడు. గత సంవత్సరం తండేల్ అంటూ బ్లాక్ బస్టర్ అందించాడు. నాగచైతన్యను 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు. ఆతర్వాత చైతన్య వృషకర్మ అనే సినిమా చేస్తున్నాడు. చందూ మొండేటి వాయుపుత్ర అంటూ యానిమేషన్ ఫిల్మ్ అనౌన్స్ చేశారు. ఈ మూవీని దసరాకి రిలీజ్ అంటూ ప్రకటించారు. అయితే.. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. చందూ నెక్ట్స్ ఏంటి..?
Chandoo Mondeti | హీరోల కోసం వెయిట్ చేస్తే..

తండేల్ సినిమా తర్వాత చందూ మొండేటి స్టార్ టాలీవుడ్ స్టార్ హీరోతో భారీ సినిమా చేయాలని ప్రయత్నించాడు కానీ.. వర్కవుట్ కాలేదు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో సినిమా చేయాలని ట్రై చేశాడు. కానీ.. సెట్ కాలేదు. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్యతో చందూ సినిమా చేయాలని కథ రెడీ చేయడం.. సూర్యని కలిసి స్టోరీ చెప్పడం జరిగింది కానీ.. ఆ ప్రాజెక్ట్ ఇంత వరకు సెట్ కాలేదు. ఇక హీరోల కోసం వెయిట్ చేస్తే.. టైమ్ వేస్ట్ అవుతుంది అనుకుని యానిమేషన్ మూవీ ప్లాన్ చేశాడు. వాయుపుత్ర అంటూ అనౌన్స్ చేశారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ యానిమేషన్ మూవీని నాగవంశీ నిర్మిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఏమైందో ఏమో కానీ దీనిని పక్కనపెట్టేశారని టాక్..
Chandoo Mondeti | కార్తికేయ 3..

మరి.. చందూ మొండేటి సినిమా ఎవరితో అంటే.. ఇటీవల నాగార్జున కోసం కథ రెడీ చేస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఇది కూడా సెట్ కాలేదట. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. కార్తికేయ 3 సినిమా చేయడం కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలిసింది. నిఖిల్, చందూ మొండేటి ఈ ఇద్దరి కాంబోలో కార్తికేయ సినిమా చేస్తే.. సక్సెస్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా కార్తికేయ 2 తీస్తే.. పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా కార్తికేయ 3 చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమా రిలీజ్ బిజీలో ఉన్నాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత కార్తికేయ 3 పై క్లారిటీ వస్తుందని సమాచారం.

