Champions Trophy – చివరిలో కివీస్ ధనా ధన్ బ్యాటింగ్… పాక్ విజయ లక్ష్యం ఎంతంటే
కరాచీ – ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చివరి ఓవర్ ల లో ధనా ధన్ బ్యాటింగ్ చేసింది.. దీంతో నిర్ధారిత 50 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 320పరుగులు చేసింది. నేటి నుంచి పాకిస్తాన్ లో ఆరంభమైన ఈ టోర్నిలో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కివీస్ బ్యాటర్స్ యంగ్,లాథమ్ లు శతకాలు సాధించారు.. గ్లెన్ ఫిలిప్స్ అర్ధ శతకం చేశాడు.. దీంతో కివీస్ 321పరుగుల భారీ టార్గెట్ ను పాక్ ముందుంచింది..
ఇక మ్యాచ్ లో 10 పరుగులు చేసిన డేవిన్ కాన్వే పాక్ స్పీడ్ స్టర్ అర్బర్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక రెండో వికెట్ గా ఒక పరుగు చేసిన కేన్ విలియమ్స్ వెనుతిరిగాడు.. ఈ వికెట్ నసీమ్ షా కు దక్కింది. మూడో వికెట్ ను మిచెల్ రూపంలో కోల్పోయింది. ఈ వికెట్ హరీశ్ రాఫ్ దక్కింది.. మిచెల్ కేవలం పది పరుగులు మాత్రమే చేశాడు..అటు తర్వాత యంగ్ కు తోడుగా బరిలోకి వచ్చిన లాంథమ్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు.. ఈ ఇద్దరు కలసి నాలుగో వికెట్ కు 118 పరుగులు జోడించారు.. యంగ్ 107 పరుగులు చేసి నసీమ్ బౌలింగ్ లో నాలుగో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. యంగ్ 113 బంతులలో ఒక సిక్స్ , 12 ఫోర్లతోఈ పరుగులు సాధించాడు ఇక గ్లెన్ ఫిలిప్స్ తో కలసి లాథమ్ పరుగుల వరద పారించాడు.. ఈ ఇద్దరు కలసి అయిదు వికెట్ కు 125 పరుగులు జోడించారు. 61 పరుగులు చేసిన ఫిలిప్స్ అయిదో వికెట్ గా రాఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. లాథమ్ మొత్తం 118 పరుగులు చేసి నాటాట్ గా మిగిలాడు.
పాక్ బౌలర్లలో నసీమ్, రాఫ్ ల కు రెండేసి వికెట్లు లభించగా, అర్బర్ ఆహ్మద్ లకు ఒక్కొ వికెట్ దక్కింది.