దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ రెండో వికెట్ పడింది. ఇండియాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్యటింగ్ కు దిగిన కివీస్ రెండో వికెట్ కోల్పోయింది.
వరుస బౌండరీలతో టీమిండియా బౌలర్లకు ముప్పుగా మారుతున్న ఓపెనర్ రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 37) ఔటయ్యాడు.
కుల్దీప్ యాదవ్ వేసిన 11వ ఓవర్లో రచిన్ క్లీల్ బౌల్డ్ అయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్ (10), డారిల్ మిచెల్. న్యూజిలాండ్ 11 ఒవర్లలో రెండు వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది.