- టోర్నీలోనే అత్యల్ప స్కోర్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికా దాటికి కుప్పకూలింది. సఫారీల బౌలింగ్‌కు ఇంగ్లండ్‌లోని విధ్వంసక బ్యాటర్లంతా.. స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో టోర్నీలో ఇంగ్లండ్ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కేవలం 179 పరుగులు మాత్రమే చేసి 38.2 ఓవర్లలోనే ఆలౌటైంది.
సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్ మూడు వికెట్లతో చెలరేగారు. కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీయగా.. లుంగీ ఎన్గిడి, కగిసో రబడ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోరూట్ (37) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక జోఫ్రా ఆర్చర్ (25), బెన్ డకెట్ (24), కెప్టెన్ జాస్ బట్లర్ (21) పరుగలుకే వెన్ను చూపారు.
కాగా, టోర్నీలో 180 పరుగుల విజయలక్ష్యంతో సౌతాఫ్రికా జట్టు బరిలోకి దిగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యల్ప ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్
- 179 ఇంగ్లండ్ vs దక్షిణాఫ్రికా – (కరాచీ) ఈరోజు
- 228 బంగ్లాదేశ్ vs ఇండియా – (దుబాయ్)
- 236/9 బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (రావల్పిండి)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అత్యల్ప స్కోర్ చేసి ఆలౌట్ అయిన జట్లు
- 179 ఇంగ్లండ్ vs దక్షిణాఫ్రికా – (కరాచీ) ఈరోజు
- 208 ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా (కరాచీ)
- 228 బంగ్లాదేశ్ vs ఇండియా (దుబాయ్)
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్లు:
- 125 ఇంగ్లండ్ vs భారత్ (జైపూర్ 2006)
- 146 ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ (జోహన్నెస్‌బర్గ్ – 2009)
- 169 ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ (కార్డిఫ్ – 2013)
- 169 ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా (జైపూర్ – 2006)