Challapally | రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడిగా పెద్దారెడ్డి..

Challapally | చల్లపల్లి, ఆంధ్రప్రభ : ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడిగా చల్లపల్లి మండలం, లక్ష్మీపురం పంచాయతీ రామానగరానికి చెందిన నాయుడు చంద్రశేఖర్ (పెద్దారెడ్డి) ఎన్నికయ్యారు. రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు ముదిరాజ్ సంఘ నాయకులు పెద్దారెడ్డికి అభినందనలు తెలిపారు. యువతను సంఘటితం చేస్తూ ముదిరాజ్ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. తన పై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు సంఘ నాయకత్వానికి పెద్దారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ సందర్భంగా మాజీ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ యువత సమస్యల పరిష్కారం, ఉపాధి అవకాశాల కల్పన, సామాజిక హక్కుల సాధన కోసం చురుకుగా పని చేస్తానని పెద్దారెడ్డి తెలిపారు.

Leave a Reply