అజ్మీరా ట్రెండ్స్ డ్రెస్సెస్ షాప్ ప్రారంభం..

అజ్మీరా ట్రెండ్స్ డ్రెస్సెస్ షాప్ ప్రారంభం..
- ప్రారంభించిన అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్
కరిమాబాద్, ఆంధ్రప్రభ ; వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తా స్టేషన్ రోడ్ ప్రాంతంలో అజ్మీరా ట్రెండ్స్ డ్రెస్సెస్ షాప్ ను బిజెపి రాష్ట్ర నాయకులు అర్బన్ కోపరేట్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గురువారం ప్రారంభించారు. డ్రెస్సెస్ షాప్ యజమానులు వైట్ల క్రాంతి కుమార్ ,తాటిపాముల శివరామకృష్ణ , తాటిపాముల బిక్షపతినూతనంగా ఏర్పాటు చేసినటువంటి అజ్మీరా ట్రెండ్స్ బట్టల షాపు ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన షాపును ప్రారంభించి యాజమాన్యానికి బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ చౌరస్తాలు ఆధునికంగా డ్రెస్సెస్ షాపు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు పాల్గొన్నారు.
