Chairman | ఘనంగా మేఘారెడ్డి జన్మదినం

Chairman | ఘనంగా మేఘారెడ్డి జన్మదినం

Chairman | మునుగోడు, ఆంధ్రప్రభ : కొంపల్లి అభివృద్ధి ప్రదాత,వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల సమక్షంలో వెదిరె మేఘా రెడ్డి కేక్ కట్ చేశారు. వారి జన్మదినం సందర్భంగా అభిమాని మోగుదాల రాంప్రసాద్ చెరువుగట్టులో వృద్ధులకు, అనాథాశ్రమానికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సంద‌ర్భంగా వెదిరె మేఘారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పుట్టినరోజు సందర్భంగా ప్రజలు తనపై చూపించిన అభిమానానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటానన్నారు. తన పుట్టినరోజున సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ్, తదితరులు వెదిరె మేఘా రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వెదిరె మేఘా రెడ్డి సోదరుడు, గ్రామ ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో చీకటి మామిడి సర్పంచ్ జీడిమడ్ల సైదులు, వార్డ్ మెంబర్లు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply