ఇంటి గ్యాస్‌తో వాణిజ్య మంట

ఇంటి గ్యాస్‌తో వాణిజ్య మంట

  • గృహ వినియోగ సిలిండర్‌లు పక్కదారి
  • వాణిజ్య అవసరాలకు మళ్లింపు
  • యథేచ్ఛగా వ్యాపార అవసరాలకు వినియోగం
  • నిబంధనలకు నీళ్లు..
  • అధికారులేం చేస్తున్నారు..

మద్దూర్, ఆంధ్రప్రభ : గృహనివాసలకు వినియోగించాల్సిన వంట గ్యాస్ పక్కదారి పడుతోంది.మద్దూర్ మున్సిపాలిటీ తో పాటు మండల కేంద్రంలో గ్రామాలలో వ్యాపారంగా దినదినాభివృద్ధి చెందుతుంన్నాయి. హోటళ్లు, టిఫిన్, పాస్ట్ ఫుడ్ సెంటర్ లో తినుబండారాల దుకాణాలు ఎక్కువ వెళ్ళస్తున్నాయి. అయితే హోటల్స్ యాజమాన్యం వంట చేసేందుకు వాణిజ్య వాణిజ్య సిలిండర్ వినియోగించకుండా గృహ అవసరాలకు ఉపయోగించే వాటిని వాడుతున్నారు.

యథేచ్ఛగా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న.. హోటల్‌ కానీ..దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చాయ్ హోటల్స్ పై దాడి చేసిన సంఘటనలే లేవు. అంతా ఆన్‌లైన్‌ అయినా మోసాలు మాత్రం ఆగడం లేదు.. వ్యాపారుల వద్ద డొమెస్టిక్‌ సిలిండర్లు కళ్లెదుటే కనిపిస్తున్నా కన్నెత్తి చూడరు. యథేచ్ఛగా గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తున్నా సంబంధిత అధికారుల చర్యలు శూన్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Leave a Reply