Central | తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రోజు..

Central | తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రోజు..
- మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి
- డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు, జిల్లా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
Central | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రోజని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ఇవాళ విజయ్ దివస్(Vijay Diwas)ను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్.రాజేందర్ రెడ్డి పాల్గొని మొదటిగా నారాయణపేట పట్టణంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో బెలూన్లను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. తరువాత పట్టణ పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం(Palabhishekam) చేశారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ రథసారథి కేసీఆర్ 11రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఢిల్లీ(Delhi) మెడలు వంచి తెలంగాణ ప్రకటన వెలువడేలా చేసిన చారిత్రక రోజు ఇది అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిన రోజు, కేసీఆర్ ఉక్కు సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం(Central Government) తలొగ్గి రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన విజయ్ దివస్ ఇదేనని అన్నారు. ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ దేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు,వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
