CPI | పత్తి కొనుగోళ్లపై కొర్రీలు ఎత్తివేయాలి

CPI | పత్తి కొనుగోళ్లపై కొర్రీలు ఎత్తివేయాలి

ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి


CPI | కురవి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ సంస్థ సిసిఐ పత్తి పంట కొనుగోళ్లపై పెట్టిన రక రకాల కొర్రీలు రైతులకు శాపంగా మారాయని వాటిని వెంటనే ఎత్తివేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) డిమాండ్ చేశారు.

బుధవారం మండల కేంద్రం లోని సిపిఐ (CPI) కురవి గ్రామ కమిటి సమావేశం లో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల, తుఫానులతో పత్తి  దిగుబడి తక్కువై రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తేమ నిబంధ ఎత్తివేయకపోగా సిసిఐ, తేమ 8 శాతం నుండి 12 శాతం ఉంటేనే కొంటామని, 12 క్వింటాల నుండి 7 క్వింటాళ్లకు తగ్గించి కొనుగోలు చేయడం, కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకుంటేనే కొంటామని రకరకాల నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయని, వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతులు ఆందోళన చెందుతున్న కొర్రీలు ఎత్తి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈనెల 21న కురవి కి విచ్చేయుచున్న సిపిఐ (CPI) వందేళ్ల ఉత్సవాల ప్రచార బస్ జాతకు  కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ టౌన్ కార్యదర్శి తురక రమేష్, బుడమ వెంకన్న, నిలుగొండ నాగేశ్వర్ రావు, టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply