Cell phone | నిజాయితీగా ఉండాలి..

Cell phone | నిజాయితీగా ఉండాలి..

  • గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్

Cell phone | భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : పోయిన సెల్ ఫోనును జగిర్యాల్ గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్ బాధితుడికి అప్పగించారు. తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన బండి నరేష్ భీమ్‌గల్‌ వైపు వెళ్తుండగా జాగిర్యాల్ గ్రామంలో తన సెల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఆ ఫోన్ జాగిర్యాల్ గ్రామానికి చెందిన గాండ్ల నర్సయ్యకు దొరకింది.

దానిని గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్‌కి అందించారు. నరేష్‌ ను పిలిపించి పంచాయతీ కార్యాల‌యంలో ఆ సెల్ ఫోన్‌(Cell phone)ను అంద‌జేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉన్నప్పుడే మంచి జరుగుతుందన్నారు. నర్సయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ చిన్నోళ్ల నవీన్, వార్డ్ సభ్యులు రాజేశ్వర్ పాల్గొన్నారు

Leave a Reply