Celebrations | ఘనంగా కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు

Celebrations | కరీమాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు తెలంగాణ ఉద్యమ రథసారదుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కారణజన్ముడు జాతిపిత అని మాజీ ఎంపీ మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని వరంగల్ పోచం మైదానం జంక్షన్ లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే నరేందర్ వందలాదిమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కేక్ కట్ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తిని జాతిపితగానే సంబోధిస్తామని, అలుపెరుగని మడమ తిప్పని నాయకునిగా అష్ట కష్టాలు ఓర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు వీరుడు కెసిఆర్ అని వారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎందరో బలిదానం చేశారని కెసిఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలను ఒక త్రాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కెసిఆర్ అని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, కొమ్మిని సురేష్, మోడం ప్రవీణ్, వందలాదిమంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు.

Leave a Reply