CC Roads | గెలిచిన వెంటనే వాగ్దానాలు నెరవేరుస్తా..

CC Roads | గెలిచిన వెంటనే వాగ్దానాలు నెరవేరుస్తా..

  • ఆదరించి.. సర్పంచ్ గా గెలిపించండి..

CC Roads | కమాన్ పూర్, ఆంధ్రప్రభ : కమాన్ పూర్ సర్పంచ్ గా ఆదరించి గెలిపిస్తే.. ఇచ్చిన వాగ్దానాలు తప్పక నెరవేరుస్తానని యువ నాయకుడు పోతుల కుమార్ తెలిపారు. తనకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి తనను సర్పంచ్ గా గెలిపించాలని కోరుతున్నారు.

గ్రామానికి వైకుంఠ రథం, డంపింగ్ యార్డు, అంబులెన్స్, నూతన సదుపాయలతో కూడిన ఎలక్ట్రికల్ వైకుంఠ దామం(Electrical Vaikuntha Dam) నిర్మిస్తానన్నారు. పురాతన మరుగుదొడ్లను వినియోగంలోకి తెస్తానని, పర్మినెంట్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తానని, విడతల వారీగా ప్రతి వాడలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానన్నారు.

అర్హత గల ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను ఇప్పిస్తానని, ఆదివరాహ స్వామి టెంపుల్ రోడ్డుపై కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉచిత విద్యా కోర్సుల్లో సింగరేణి, ఎన్టిపీసీ(NTPC) ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తానన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు యువతకు దక్కేలా కృషి చేస్తానన్నారు.

నూతన, పురాతన డ్రైనేజీలు, సీసీ రోడ్లు(CC Roads), వీధి దీపాలను పునరుద్ధరణ, పురాతన బస్టాప్ పునరుద్ధరిస్తానన్నారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బోరు వేయించడం, విడతల వారీగా ఇచ్చిన హామీలు తీరుస్తానని స్పష్టం చేశారు. పాన గుర్తుకు ఓటు వేసి తనను గెలించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply