గ్రామ సమస్యలపై దృష్టి సారించండి…

గ్రామ సమస్యలపై దృష్టి సారించండి…

  • సర్పంచ్ మాడుగుల మహేష్

ఊరుకొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని రాచాలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మాడుగుల మహేష్ అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేయాలని, అదేవిధంగా గ్రామ అభివృద్ధి పై అందరం కలిసి ఐక్యంగా కృషి చేయాలని గ్రామ వార్డు సభ్యులకు, నాయకులకు సూచించారు.

గ్రామంలోని నూతన సిసి రోడ్ల నిర్మాణం, నీటి సమస్య, పారిశుద్ధ్యం పై సమావేశంలో చర్చించారు. గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటస్వామి, పంచాయతీ కార్యదర్శి ఇందిర, వార్డు సభ్యులు, నాయకులు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply