ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; బీజేపీతోనే గ్రామాలఅభివృద్ధి సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీడీకే అరుణ కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తానని బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ బీసీ కాలనీలో ఎంపీ నిధులతో ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డితో కలిసి సిసి రోడ్డు పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. దేశంఅభివృద్ధి చెందాలంటే పల్లెలే పట్టుకొమ్మలని మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి,ప్రధాని నరేంద్ర మోదీ గ్రామ జనాభా ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ సర్పంచ్ ఖాతాలో జామ చేస్తున్నారనిఅన్నారు.

గతంలో కేద్రం నిధులు గ్రామాలకు మంజూరై గ్రామాలకు వచ్చే వరకు మొత్తం ఖాళీ అయ్యేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుండి కూడా గ్రామ పంచాయితీకి అరకొర నిధుల వలన అభివృద్ధి జరగడం లేదని అన్నారు. కేంద్రం నుండి వచ్చిన డబ్బుల ద్వారానే గ్రామాలలో పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి జరుగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్పంచ్ లకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నేరేడుగం రాఘవేంద్ర, దొరోల్ల జయమ్మ, చెన్నారెడ్డి, గుడిసెరాజు, వెంకటేష్ గౌడ్ ఎల్లప్ప, నాయకులు జి. రాజప్ప, కృష్ణయ్య, ఆంజనేయులు గౌడ్,పత్తి ఆంజనేయులు,నగేష్ గౌడ్, హెచ్. నర్సింహా, మహేష్ గౌడ్, అశోక్ గౌడ్, నర్సింహా రెడ్డి, వెంకటప్ప, అశోక్, కుర్మప్ప, రామలింగయ్య, తులసిదాస్, ఉప్పు ఆంజనేయులు,తిరుపతి, శివ, రాజు, జగదీశ్ నారాయణ గౌడ్, రామలింగం గౌడ్, వడెప్ప, ఉప్పు రమేష్, చిన్న నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply