CC ROAD | ప్రజాసేవ ధ్యేయంగా..

CC ROAD | ప్రజాసేవ ధ్యేయంగా..


CC ROAD | జన్నారం, ఆంధ్రప్రభ : తనను ఆదరించి గెలిపిస్తే.. గ్రామంలోని చెరుగూడెంకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో సీసీ రోడ్డు వేయిస్తానని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీలోని చెరుగూడెం, వినాయక నగర్,వాసవినగర్, మేదరివాడ,రామ్ నగర్ లో ఇంటింటా తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఉంగరం గుర్తుకు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సేవే మార్గంగా సేవకురాలిగా పని చేస్తానన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సహకారంతో గ్రామంలో మినీ స్టేడియం, సెంట్రల్ లైటింగ్, డివైడర్, ప్రధాన రోడ్డు పై డ్రైనేజీని నిర్మించడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రజాసేవ ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫసిహుల్ల, మాజీ సర్పంచి జక్కు భూమేష్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రమేష్ , నేతలు ఎం.హన్మంతరావు, సుధీర్ కుమార్, బి.శ్రీనివాస్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply