సీసీ కెమెరాలు ఏర్పాటు

సీసీ కెమెరాలు ఏర్పాటు
దాత మెరుగు శ్రీనివాస్ కు సన్మానం
సర్పంచ్ వసంత నాగేష్ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామపంచాయతీలో దాత మెరుగు శ్రీనివాస్ యాదవ్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ధాత మెరుగు శ్రీనివాస్ యాదవ్ ను సర్పంచ్ వసంత నాగేష్ గౌడ్ శాలువా కప్పి సన్మానించారు.
గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని ప్రముఖ వ్యాపారవేత్త మెరుగు శ్రీనివాస్ యాదవ్ ను అడిగిన వెంటనే ముందుకు వచ్చి సహకరించినందుకు గాను అతనికి గ్రామ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బ్రాహ్మణి, గ్రామపంచాయతీ 5వ వార్డు మెంబర్ పాలమాకుల కవిత నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, 6వ వార్డు సభ్యుడు పాలమాకుల నవ్య నరసింహ, ఏఎంసీ డైరెక్టర్, 9వ వార్డు సభ్యుడు చప్పిడి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ లు గుండు మల్లయ్య గౌడ్, తడక ఆంజనేయులు, మాజీ వార్డు మెంబర్ కోరగోని నరసింహ, నాయకులు పబ్బు మహేష్, గంజి సురేష్, భావండ్లపల్లి రాజు, చౌట లింగస్వామి, పబ్బతి వెంకటేశం గుండు రాజు తదితరులు పాల్గొన్నారు.

