• సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు

సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖులను కలిశారు. భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ ఆంబులేతో పాటు టౌన్‌షిప్ గ్లోబల్ లీడ్ లో చేర్ ఎక్, ఎవర్‌సెండై ఇంజినీరింగ్ ఎక్స్‌క్యూటివ్ చైర్మన్ టాన్ శ్రీ డాటో ఎ.కె. నాథన్‌తో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు.

గ్రీన్ ఎనర్జీ, పోర్టులు, హెల్త్, డిఫెన్స్, ఐటీ, సెమికండక్టర్లు, ఏవియేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఏపీ సిద్ధంగా ఉందని, ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు.

సింగపూర్ కంపెనీలకు పాలసీలు, సహకారం సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో సింగపూర్ భాగస్వామ్యం గుర్తు చేస్తూ, ఇప్పుడు అపోహలు తొలగించేందుకు తన పర్యటనను ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు.

Leave a Reply