CBI | సింగరేణి అక్రమాలపై

CBI | సింగరేణి అక్రమాలపై
CBI | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సింగరేణి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… గతంలో బీఆర్ఎస్ ఎలా పని చేసిందో కాంగ్రెస్ కూడా అలాగే పని చేస్తోందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని విధ్వంసం చేస్తోంది. రాజకీయ ప్రయోగశాలగా సింగరేణిని మార్చారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేంద్రం సహకారం అందిస్తోంది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించాను. సింగరేణిని కాంగ్రెస్ బంగారు బాతులా వాడుతుందన్నారు. నైనీ బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక పనులు ఎందుకు ఆలస్యం చేశారు? అని ప్రశ్నించారు.
