MARKET | పశువుల సంత ఏర్పాటు …

MARKET | పశువుల సంత ఏర్పాటు …

MARKET | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ :  హుజూర్‌నగర్ నియోజక వర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో పశువుల సంత ఏర్పాటు చేసేందుకు హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం అధికారులు చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్ దేశుముఖ్ తెలిపారు. బుధవారం స్తానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, స్తానిక శాసనసభ్యులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( MLA Minister Uttam kumar Reddy) సహకారంతో హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ ను అన్ని విధాలుగా రైతులకు ఉపయోగ పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

ఇప్పటికే మార్కెట్ లో నిరుపయోగంగా ఉన్న పాత గోడౌన్ నిర్మాణాలు కూల్చి వేసి, వాటి స్థానంలో ఆధునిక నిర్మాణాలు, మోడల్ విద్యుతీకరణా, వ్యవసాయ మార్కెట్ కు అనుబంధంగా ఉన్న మఠంపల్లి, చింతలపాలెం మండల కేంద్రాలలో ఉన్న వ్యవసాయ మార్కెట్ నూతన గోడౌన్ ల నిర్మాణ్మచేపట్టేందుకు  ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన మఠంపల్లి (Mathampally)  లో పశువుల సంత ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆ దిశగా మంత్రి ఉత్తమ్ సహకారంతో త్వరలో ఆయన చేతుల మీదుగా పశువుల సంత ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యవసాయ మార్కెట్ పాత చెక్ పోస్ట్ లను పునరుద్ధరించి మార్కెట్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం అధికారులు చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు.

అందుబాటులో డ్రైయర్ యంత్రం …

హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం ఆరబెట్టుకునే డ్రైయర్ యంత్రం అందుబాటులోకి తెచ్చినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక దేశుముఖ్ (Radhika Deshmukh) తెలిపారు. రైతులు పండించిన పంట మార్కెట్ లో అమ్ముకునేందుకు, దాచుకునేందుకు వచ్చిన రైతులు ధాన్యం పచ్చిగా ఉంటే ఈ యంత్రం ద్వారా ధాన్యం ను ఆరపెట్టుకుని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర ను పొందవచ్చన్నారు.

Leave a Reply