యాక్ట్ 1999 కింద కేసులు నమోదు

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : అధిక వడ్డీ ఆశ చూపి 106 మంది నుండి రూ. 50 కోట్లు వసూలు చేసి పరారైన నిందితుడు రమావత్ బాలాజీ నాయక్‌(Ramavat Balaji Nayak)ను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్(Sharat Chandra Pawar) చెప్పారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నిందితుడి వివరాలను వెల్లడించారు. పెద్ద అడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధిలోని పలుగు తండాకు చెందిన బాలాజీ నాయక్ డిగ్రీ వరకు చదువుకున్నాడని చెప్పారు.

అనంతరం ఐస్ క్రీమ్ పార్లర్(Ice Cream Parlor) వ్యాపారం చేస్తానని బంధువుల వద్ద రెండు రూపాయల వడ్డీకి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడని అందులో నష్టం రావడంతో రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారం వైపు మళ్లాడని చెప్పారు. ఈ క్రమంలో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని నూటికి పది రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పి పలుగు తండా, పుట్టం గండి తండా, గడ్డ మీది తండా, చింతల్ తండా, నక్కల పెంట తండా, పావురాల గట్టు, వద్దిపట్ల గ్రామాల ప్రజల వద్ద డబ్బులు వసూలు చేయించేవాడని చెప్పారు.

ఏజెంట్లు(Agents) డబ్బులు వసూలు చేసి బాలాజీ నాయక్ కు అప్పగించే వారని చెప్పారు. నెలరోజుల తర్వాత వడ్డీ చెల్లించినట్లు ప్రామిసరీ నోట్ల(Promissory Notes) వెనక రాసి మొత్తానికి మళ్లీ కొత్త ప్రామిసరీ నోటు రాసిచ్చే వాడని చెప్పారు. బ్యాంకులో వచ్చే వడ్డీ కంటే పది రెట్లు ఎక్కువగా వడ్డీ వస్తుండడంతో పలువురు బాలాజీ నాయక్ కు డబ్బులు అప్పగించారని చెప్పారు. నిందితుడు ప్రజల నుండి తీసుకున్న డబ్బులలో సుమారు మూడు కోట్ల రూపాయలను వైన్స్ షాపుల(Wine Shops) పర్మిషన్ కోసం, స్టాక్ మార్కెట్, ఆర్బిఎన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్(RBN Software Solution) సాఫ్ట్వేర్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు అని చెప్పారు.

కొన్ని రోజుల నుండి అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో బాధితుల నుండి వస్తున్న ఒత్తిళ్లతో పారిపోయాడని చెప్పారు. నిందితుడు బాలాజీ నాయక్ పై గుడిపల్లి పోలీస్ స్టేషన్లో 316 (2),318 (4) బీఎంఎస్ సెక్షన్(BMS Section) 5 ఆఫ్ టి ఎస్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

నిందితుడి నుండి ఫార్చునర్ కారు, స్కార్పియో కారు(Scorpio Car) (రూ. 80 లక్షలు) విలువ, మిర్యాలగూడ, హయత్ నగర్, నేరేడుచర్ల, పలుగు తండాలో ఇల్లు, దామరచర్ల(Damaracharla) వద్దిపట్ల గ్రామాలలో వ్యవసాయ భూములకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బాధితులకు రాసిచ్చిన 36 ప్రామిసరీ నోట్లు, 77 ఖాళీ ప్రామిసరీ నోట్లు,రూ. 5.5 లక్షల విలువ చేసే ఏడు సెల్ ఫోన్లు, రిజిస్టర్ బుక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు.

బాలాజీ నాయక్ తో పాటు, అతని బినామీల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను పోలీసు విచారణ చేపట్టి బాధితులకు కోర్టు ద్వారా రికవరీ చేయిస్తామని ఆయన చెప్పారు. బాలాజీ నాయక్ కేసుపై ఏ ఎస్ పి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలతో విచారణ చేపిస్తున్నట్లు చెప్పారు. బాధితులు ఎవరు అధైర్యపడవద్దని, ఎవరి ఒత్తిళ్లకు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. బాధితులు(Victims) నేరుగా తమ వద్ద ఉన్న పత్రాలతో గుడిపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించి కేసులు నమోదు చేసుకోవాలని ఎస్పి శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏ ఎస్ పి మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply