గ్యాస్‌పై అధిక వసూళ్లు చేస్తే కేసులు

గ్యాస్‌పై అధిక వసూళ్లు చేస్తే కేసులు
మునుగోడు, ఆంధ్రప్రభ : గ్యాస్ సిలిండర్లకు నిర్ణీత ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం మునుగోడులోని సాయి దుర్గ గ్యాస్ ఏజెన్సీపై వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేయరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అలాగే ఎండ తీవ్రతలో వినియోగదారులను ఎక్కువసేపు వేచి ఉంచడం సరికాదని, తక్షణ సేవలు అందించాల్సిన బాధ్యత ఏజెన్సీలపై ఉందని తెలిపారు.వినియోగదారులు ఎక్కడైనా అధిక వసూళ్లు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు.
