సృష్టిపై కేసు న‌మోదు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన సృష్టి విష‌యంలో ఈడీ రంగంలోకి దిగింది. సరోగసీ పేరుతో వారు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. పోలీసులు విచారణలో రోజుకో కొత్త కోణం బయటపడింది. దీంతో డాక్టర్ నమ్రత (Dr. Namrata)తో పాటు ఆమె బృందాన్ని పోలీసులు అరెస్టు చేసి సుదీర్ఘంగా విచారించిన సంగ‌తి విదిత‌మే. అలాగే పెద్ద ఎత్తున మనిలాండరింగ్ కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. మొత్తం నాలుగు నెలల్లో సుమారు రూ.500 కోట్ల లావాదేవీలు (Transactions worth Rs. 500 crore) జరిగాయని వారు గుర్తించారు.

నిందితులు పిల్లలు లేనివారి నుంచి సుమారు రూ.50 లక్షల వరకు వసూలు చేసి, తమ వద్ద ఉన్న బాలికలను ఇతర కుటుంబాలకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌లో 25 మంది నిందితులుండగా.. వారిలో ఐదుగురు డాక్టర్లు, ఎనిమిది మంది ఇతర కార్యకర్తలు అరెస్టు అయ్యారు. డాక్టర్ నమ్రత ప్రధాన నిందితురాలిగా గుర్తించబడింది. ఈడీ ఈ కేసును మనీ లాండరింగ్ చట్టం కింద నమోదు చేసి, అక్రమ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది. కాగా ఈ సృష్టి కేసు సంచలనం తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుమారు 60–70 ఫెర్టిలిటీ సెంటర్ ను తనిఖీ చేయడానికి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply