పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన కారు

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : హైద‌రాబాద్‌లోని లంగర్ హౌస్ దర్గా(Langar House Dargah) సమీపంలో ఆదివారం తెల్లవారు జామున డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్నిఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో క‌శ్వి (20) దుర్మ‌ర‌ణం పాలైంది. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ముగ్గురు కానిస్టేబుళ్ల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఆ కారులో ఇద్ద‌రు యువ‌కులు, ముగ్గురు యువ‌త‌లు ఉన్నారు.

ప్ర‌మాదం జ‌రిగిందిలా…
లంగ‌ర్ హౌస్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నడిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ(Inspector Satyanarayana) వాహనాన్నివెనుక నుంచి వ‌చ్చిన కారు ఢీకొంది. అప్ప‌టికే ముగ్గురు పోలీసులు(Police) వాహ‌నంలో ఉన్నారు. వారికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

కారు ప్ర‌యాణం చేస్తున్నక‌శ్వి(Kashvi) మృతి చెంద‌గా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. మద్యం మత్తు(Drunk)లో ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి చర్యాప్తు చేపట్టారు.

Leave a Reply