Captains | ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏమిటి?

Captains | ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏమిటి?

Captains | ఆల్‌రౌండర్లపై పడుతున్న ప్రభావం
కెప్టెన్ల అసంతృప్తి వెనుక కారణాలు
బీసీసీఐ 2027కి ముందు తీసుకునే నిర్ణయం

Captains | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐపీఎల్‌ వస్తుందంటే క్రికెట్ అభిమానులకు పండగ. కానీ కెప్టెన్లకు మాత్రం ఇందులో ఒక సమస్య ఉందట—అదే ఇంపాక్ట్ ప్లేయర్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పెద్ద వివాదం చెలరేగుతోంది. మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్ అద్భుతంగా ఆడితే మ్యాచ్ మలుపు తిరుగుతుంది. కానీ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ కంటే ఆల్‌రౌండర్లు ముఖ్యమని కెప్టెన్లు వాదిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆల్‌రౌండర్లు తీవ్రంగా నష్టపోతున్నారు అంటూ కొంతమంది కెప్టెన్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌లో ఆల్‌రౌండర్లే గేమ్ చేంజర్స్, కానీ ఈ రూల్ వల్ల వారి విలువ తగ్గుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Captains

ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా 2027 సీజన్ నుంచి ఈ రూల్‌పై పెద్ద మార్పులు చేయాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. పూర్తిగా రద్దు చేయాలా? లేక కొన్ని పరిమితులతో కొనసాగించాలా? అనేదానిపై ఇప్పటికే అంతర్గత చర్చలు మొదలయ్యాయి. 2024–26 మధ్య జట్ల నుంచి, ఆటగాళ్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా సమీక్షించనున్న బోర్డు, చివరికి 2027కి ముందు స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply