Cancer survey | లంకలకలవగుంటలో క్యాన్సర్ సర్వే

Cancer survey | పెడన, ఆంధ్రప్రభ : పెడన మండలం లంకలకలవగుంటలో చేవెండ్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది శనివారం క్యాన్సర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామంలోని ప్రతి గృహానికి చేరుకొని ప్రజలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలను పరీక్షించారు. అనుమానిత కేసుల వివరాలను నమోదు చేసి, అవసరమైన వారికి తదుపరి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశారు.
