Canal | అదృశ్యమై.. కాల్వ‌లో శ‌వమై తేలి

Canal | నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో ఆరు రోజుల క్రితం అదృశ్యమైన అశ్విన్ (3) అనే బాలుడు శనివారం కాల్వ‌లో శవమై తేలాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీ శివారు ఓ గుంతలో శవం లభ్యమైంది. ఇంటి ముందు ఆడుకుంటూ ఆరు రోజుల క్రితం అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మృతదేహం లభించడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు నాళాలో పడి మరణించాడా? ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply