Canada Open | సెమిఫైనల్లో శ్రీకాంత్ ఓటమి… ముగిసిన భారత్ పోరు !

భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు ఫైనల్ చేరాలనే ఆశలు ఆవిర‌య్యాయి. కెనడా ఓపెన్ 2025 సెమిఫైనల్లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటో చేతిలో త‌ల‌ప‌డిన శ్రీకాంత్ కు ఓట‌మి ఎదురైంది. మూడుసెట్ల పాటు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో శ్రీకాంత్ 21-19, 14-21, 18-21 స్కోర్లతో ఓడిపోయారు. మ్యాచ్ దాదాపు ఒక గంట 18 నిమిషాలు కొనసాగింది.

శ్రీకాంత్ ఓటమితో కెనడా ఓపెన్ (సూపర్ 300) టోర్నమెంట్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఇక అందరి దృష్టి జూలై 15 నుండి 20 వరకు జపాన్‌లో జరగనున్న జపాన్ ఓపెన్ (సూపర్ 750) టోర్నమెంట్‌పై ఉంది.

Leave a Reply