అశౌచము ఉన్నవారు ఆరాధన చేయవచ్చా?

జన్మించినప్పుడు జాతాశౌచము, మరణించినప్పుడు మృతాకోచము పుత్రులకు, తల్లిదండ్రులకు, జ్ఞాతులకు ఏర్పడుతుంది. పుట్టుటా అంటే ఆత్మ శరీరంలోకి ప్రవేశించుట, మరణించుట ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లుట. జనన మరణాలు రెండు శరీరంతోటే, శరీరానికే. ఈ శరీరంలో పది ఇంద్రియాలు, ఒక మనసు ఉంటాయి. ఏ శరీరం వలన ఈ శరీరం ఏర్పడిందో, ఏ శరీరం సంబంధాన్ని విడిచి వెళ్లిందే ఆ శరీరంతో సంబంధం ఉన్నవారు కూడా తమ శరీరంలో ఉన్న పది ఇంద్రియాలను ఆ పది రోజులు సంబందం లేని శరీరాల నుంచి దూరంగా ఉంచుకోవాలి. అనగా శరీరం పది రోజులు అపవిత్రంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో స్నానాలు, దానాలు విశేషంగా చేసుకోవాలి. స్నానాలతో శరీరం, దానాలతో ద్రవ్యం, ధ్యానంతో మనసు పరిశుభ్రమవుతాయి. శరీరం అపవిత్రం అయింది కావున శరీరంతో చేసే పూజాదికాలు చేయరాదు కానీ శరీరాన్ని శుద్ధి చేసే స్నానాదులు చేయవచ్చు. మనసులో ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకోవచ్చు. పూజా మందిరాలకు, దేవాలయాలకు వెళ్లరాదు కానీ శరీరం ఇంట్లో ఉన్నా మనసును అన్ని క్షేత్రాలకు, తీర్ధాలకు పంపవచ్చు. మన ద్రవ్యం శుద్ధి కావాలి కావున దానం చేయవచ్చు. ద్రవ్యాన్ని మనతో ఉన్న సంబంధాన్ని వదులుకోవడమే దానం.

    Leave a Reply