campaigning |అభివృద్ధికి పట్టం కట్టండి..

campaigning |అభివృద్ధికి పట్టం కట్టండి..

  • బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి..
  • సర్పంచ్ అభ్యర్థి మాచర్ల జ్యోతి ఏలీయా..

campaigning |ధర్మసాగర్, ఆంధ్రప్రభ : రానున్న పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ బలపరచిన ధర్మసాగర్ సర్పంచ్ అభ్యర్థి మాచర్ల జ్యోతి ఏలీయా కోరారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో(election) బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మంగళవారం గ్రామంలో జోరుగా ప్రచారం(campaigning) నిర్వహించారు.

ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు చెబుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి పనులే సర్పంచ్ గా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారిని గెలిపిస్తే ధర్మసాగర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. .

Leave a Reply