29వ వార్డులో ప్రచార జోరు-గెలుపే లక్ష్యంగా అడుగులు

కాగజ్ నగర్ టౌన్, ఆంధ్రప్రభ ; కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సిహెచ్ రాజ్ కుమార్ గెలుపు దిశగా ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. శనివారం బిఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 29వ వార్డులోని ఓటర్లు బిఆర్ఎస్ అభ్యర్థికే మద్దతు తెలుపుతున్నారని వార్డులో పక్కా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగర వేయడం ఖాయమని అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ పార్టీతో వార్డుల అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ హయాం లో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 29వ వార్డులో అభ్యర్థి రాజ్ కుమార్ గెలవడం ఖాయ మని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, ఓటర్లు పాల్గొన్నారు.
