భారీ జన సమీకరణతో ఇంటింటి ప్రచారం

భారీ జన సమీకరణతో ఇంటింటి ప్రచారం
- చెగూరి లక్ష్మీ ప్రసన్న వేణుగోపాల్
షాద్నగర్, ఆంధ్రప్రభ : ప్రజల సేవే ధ్యేయంగా రాజకీయ రంగంలో అడుగులు వేస్తూ, బి.ఆర్.ఎస్. పార్టీకి విధేయులుగా సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్న పుణ్య దంపతులు చెగూరి లక్ష్మీ ప్రసన్న – వేణుగోపాల్ లు మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా లక్ష్మీ ప్రసన్న 28వ వార్డులో, వేణుగోపాల్ 9వ వార్డులో పోటీ చేసి ప్రజలకు చేరువయ్యారు. కాలనీవాసుల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చొరవ చూపుతూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళలు–యువతకు ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రజాసేవే రాజకీయాల అసలైన ఉద్దేశమనే భావనతో, నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ ముందుకు సాగుతున్న ఈ దంపతులు, స్థానికంగా ఆదర్శ నాయకులుగా గుర్తింపు పొందుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావంతో ప్రజల కోసం పనిచేస్తామని వారు అంటున్నారు. 9వ వార్డు, 28వ వార్డు ప్రజల ఓటుతో ఆశీర్వాదం ఇస్తే సేవ చేసి వారి రుణం తీర్చుకుంటామని వారు వాగ్దానం చేస్తున్నారు. కెసిఆర్ పాలనలో అంజయ్య యాదవ్ సాధ్యంలో చేసిన అభివృద్ధి పథకాలు సేవా కార్యక్రమాలు తమ విజయానికి దోహదపడతాయని వాటి నుంచి నీటి వరకు టిఆర్ఎస్ పాలనకు ప్రజలు ఆశీర్వదిస్తూనే ఉన్నారని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి తమ సేవకు పాత్రులవుతామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గాంధీనగర్, ఆర్టీసీ కాలనీలలో విద్యార్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ప్రచార ప్రపంచం లో పాల్గొన్న ప్రజలకు తమకు మద్దతుగా తోడుగా నిలిచిన టిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
