Campaign | రాజకీయాలలో బీసీల ప్రాధాన్యత పెరగాలి

Campaign | ఇల్లెందు, ఆంద్రప్రభ : రాజకీయాలలో బీసీల ప్రాధాన్యత పెరగాలనీ బీసీ రిజర్వేషన్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మడత వెంకట్ గౌడ్ అన్నారు. ఈ రోజు ఇల్లెందు మున్సిపాలిటీ వార్డుల్లో బీసీ జన చైతన్య యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా మడత మాట్లాడుతూ త్వరలో జరుగనున్నమున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

బీసీలు రాజకీయ, ఆర్ధిక అసమానతలు ఎదుర్కొంటున్నారని వారందరిని చైతన్యం చేసి సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చి దిద్దటమే లక్ష్యమని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో ప్రభుత్వాలునిర్లక్ష్యాంగా వ్యవహరిస్తున్న కారణంగా స్తానిక సంస్థల ఎన్నికలలో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

తాముమున్సిపల్ చైర్మన్ గాఉన్నపుడు ఇల్లెందు మున్సిపాలిటీ కి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ యువతముందుకురావాలని, పిలుపునిచ్చారు.పట్టణ ప్రజలు బీసీరిజర్వేషన్ ఉద్యమానికి మద్దతు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరణ్, పలువురు బీసీ రిజర్వేషన్ యాక్షన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply